kmitra header

ఒక కవిత..నాన్నకు ప్రేమతో..

ఒక కవిత..నాన్నకు  ప్రేమతో..
నాన్న - రెండు అక్షరాల పదం
వంద కోట్లతో సమానమైన పరమార్ధం

మీ మాటల్లో పొందాను మంచి మమకారం
మీ వ్యక్తిత్వం తో నేర్చుకున్నాను సంస్కారం

కొండంత బాధలు, బాధ్యతలు తన జీవితంలో ఉండడం
కాని నలుసంతైనా బాధలేదని నవ్వుతూ మనతో చెప్పడం

నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ అవ్వనివ్వారు జీరో
అందుకే నా దృష్టిలో ఎప్పటికి మీరే నా హీరో

మన ప్రపంచం ఎంత ఉన్నా నాన్న ప్రేమ పొందకపోవడం ఒక లోటు
విశ్వమంతా నాకు పరిచయమైనా పిడికెడంత గుండెలో ఉంటుంది మీకు గొప్ప చోటు

 

By

P. Pavan Kumar

IV year ECE-A

Share this article:

Published on:

1 March 2016

Author

Pavan Kumar Pendem

Pavan Kumar Pendem

alumni

View Profile